6 July, 2026 | 9:42 PM

Breaking News

చంద్రపురి డివిజన్‌లో సర్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం   •   గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •  

సౌదీ రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

17-11-2025 11:50 PM

మలక్‌పేట్ (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మలక్‌పేట్‌కు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. సౌదీలోని పవిత్ర ఉమ్రా యాత్రను నిర్వహించేందుకు వెళ్లిన 45 మంది యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అందులోని వారందరూ సజీవ దహనమయ్యారు. మలక్‌పేట్‌లోని ముసరాంబాగ్ డివిజన్‌కు చెందిన తల్లి కూతుర్లు అమీనా బేగం, అనీష్ ఫాతిమా సౌదీలోని బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముసరాంబాగ్‌కు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యుల్లోని ముగ్గురిని వెంటనే సౌదీకి చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.