10 March, 2026 | 11:16 AM

రైల్వే సమస్యల పరిష్కారానికి జీఎంను కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

10-03-2026 12:48 AM

మేడ్చల్, మార్చి 9 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం లో రైల్వే సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ ను ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కలిశారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే వివరించారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

రైల్వే క్రాసింగ్ ల వద్ద ఆర్ యు బి లు నిర్మించాలని, మచ్చ బొల్లారం డివిజన్లోని రైల్వే బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో టన్నెల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎల్ సి 250 బొల్లారం రైల్వే స్టేషన్ వద్ద ప్రతిపాదించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి బదులు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆర్కే పురం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద పాదాచారులు, ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని, తురకపల్లి, జనప్రియ మచ్చ బొల్లారం, వాజ్పేయి నగర్, షఫీ గూడ ప్రాంతాల్లో ఆర్ యు బి పనులు వేగవంతం చేయాలని కోరారు.

సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో త్వరలో ఇన్స్పెక్షన్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వెంట శాంతి శ్రీనివాసరెడ్డి, మేకల రాము యాదవ్, డోలు రమేష్, ఢిల్లీ పరమేష్, నేమూరు శ్రీధర్ గౌడ్, అమీనుద్దీన్, చిన్న యాదవ్, హేమంత్ పటేల్, బైరు అనిల్ తదితరులు ఉన్నారు.