9 June, 2026 | 7:18 PM

మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాం

09-06-2026 05:56 PM

హైదరాబాద్: సాగునీటి చెరువులు, కాలువల్లో పూడికతీత పనులను సమీక్షించడంతో పాటు, సాగునీటి భూములు, కాలువ కట్టలపై సౌర విద్యుత్ ప్రాజెక్టుల అమలుపై నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. రూ.35,077 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామని, రైతులకు ఇబ్బంది లేకుండా స్థానికంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 

రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్ లో 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నులు పండిందని, 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేంద్రం చెప్పింది. కానీ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని, మరో లక్ష మెట్రిక్ టన్నులు వారంలో వస్తాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. దేశంలో ఉత్పత్తయ్యే వరిలో తెలంగాణలోనే 61 శాతం పండిందని, పక్క రాష్ట్రం 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేసింది. యాసంగి పంటలో పక్క రాష్ట్రాలు మా కన్నా తక్కువగా కొన్నాయి. ధాన్యం కొనుగోలు ద్వారా మహిళా సంఘాలు పీఏసీలను బలపర్చి 53 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయించామని ఆయన గుర్తు చేశారు.

రూ.171 కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చామని, పీఏసీల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. 20.86 కోట్ల గోనె సంచుల్లో 18 కోట్లు మాత్రమే ఉపయోగించామని, రాష్ట్రం ఏర్పాడినప్పుటి నుంచి ఈ యాసంగి పంటలోనే ఎక్కువగా ధాన్యం సేకరించామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకన్నా తక్కువ ధాన్యం సేకరించిందని, బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంత వరి సేకరణ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.