20 May, 2026 | 6:02 PM

స్వచ్ఛందంగా మెడికల్ షాపులు బంద్

20-05-2026 04:55 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త బంద్‌లో కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. జిల్లా కెమిస్టులు  బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. సభ్యులందరూ కలిసి జిల్లాలో ఎక్కడైనా షాపులు తెరిచి ఉన్నచో వారిని ప్రత్యక్షంగా కలిసి బంద్‌ కు మద్దతు తెలప వలసిందిగా విజ్ఞప్తి చేశారు 

 ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.అపోలో రీచ్ హాస్పిటల్‌లోని అపోలో ఫార్మసీ, ప్రభుత్వ ఆసుపత్రుల ఫార్మసీలు మరియు కొంతమంది హాస్పిటల్ ఫార్మసీలను అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కమటాల రామ్మోహన్ , జనరల్ సెక్రటరీ గుండా మునిందర్  రాజు , కోశాధికారి కొంజర్ల మహేష్ , వైస్ ప్రెసిడెంట్ ఆడెపు కమలాకర్  పాల్గొన్నారు.