12 March, 2026 | 6:35 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

12-03-2026 12:17 PM

​రాజాపూర్: మండల పరిధిలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన చిల్వర్ నరేష్ అనే యువకుడు గురువారం రాజాపూర్ శివారులో జాతీయ రహదారి పై ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నవెల్లి కి చెందిన చిల్వర్ నరేష్ ఎంఎస్ఎన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు వెళ్లే నిమిత్తం  ఉదయం 5:30 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు.

​ఉపాధి కోసం తెల్లవారుజామునే విధులకు వెళ్తున్న యువకుడు ప్రమాదవశాత్తు మరణించడంతో చెన్నవెల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.మృతునికి భార్య ఇద్దరూ కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.