4 April, 2026 | 2:45 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

భూ వివాదంలో వ్యక్తిపై దాడి.. ముగ్గురి రిమాండ్

01-12-2025 09:42 PM

గంభీరావుపేట క్రైమ్ (విజయక్రాంతి): భూవివాదంలో వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం మేరకు 27 నవంబర్ గురువారం రోజున గోల్నేటి వెంకట నర్సు, గోల్నేటి దేవేందర్, దేవేందర్ భార్య గోల్నేని కవిత కలిసి గ్రామానికి చెందిన గోల్నేటి నర్సయ్యపై కట్టెలతో దాడి చేయగా, నర్సయ్య తలకు తీవ్రమైన గాయం తగిలింది. అడ్డుకునేందుకు వచ్చిన నర్సయ్య కొడుకులు గోల్నేని కర్ణాకర్, గోల్నేని చందు, నర్సయ్య భార్య లక్ష్మీ లను కూడా కట్టెలతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దేవేందర్, నరసవ్వ, కవితలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.