23 March, 2026 | 11:50 AM

అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం

23-03-2026 12:00 AM

జడ్చర్ల, మార్చి 22: మండలం మల్లె బోయిన్పల్లి  గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంపీ డీకే అరుణమ్మ  నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేశారు. బిజెపి సర్పంచ్ చికూరి శేఖర్ ముదిరాజ్ ఉప సర్పంచ్ శేఖర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గ్రామ ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి మండల అధ్యక్షులు యాట రామకృష్ణ ముదిరాజ్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసాల శ్రీనివాస్ రెడ్డి,  గిరిజన మోర్చా మండల అధ్యక్షులు మోహన్ నాయక్, బిజెపి కార్యదర్శి  జగదీశ్వర్, మురళి నాయక్,  బిజెపి వార్డ్ మెంబర్స్,  గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, పాల్గొన్నారు.