14 June, 2026 | 2:15 PM

గాలి వాన బీభత్సం.. జాతీయ రహదారిపై కూలిన చెట్లు

14-06-2026 11:13 AM

సదాశివపేట: సదాశివపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలమైన గాలుల ప్రభావంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడగా, జాతీయ ప్రధాన రహదారిపై కూడా చెట్లు కూలిపోవడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అలాగే సదాశివపేట ట్రాఫిక్ పోలీసుల మినీ కంట్రోల్ షెడ్డు బలమైన గాలులకు తట్టుకోలేక రోడ్డుపై పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్లు, షెడ్డును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.