25 April, 2026 | 7:26 AM

కింగ్ ఆ రోజునే

25-04-2026 12:42 AM

షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వస్తున్న చిత్రం ‘కింగ్’. ఈ సినిమా వాయిదా పడుతుందేమోనన్న సందేహాలకు తెరదించుతూ, డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ఒక వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఇదిలావుండగా ఈ సినిమాలో షారుర్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గర్భవతి కావడంతోతన యాక్షన్ సన్నివేశాలకు మేకర్స్ విరామం ఇస్తారని అందరూ భావించారు. కానీ, దీపికా ఏప్రిల్ 21, 22 తేదీల్లో జరిగిన షూటింగ్ షెడ్యూళ్లలో అత్యంత భారీ పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం.