20 May, 2026 | 5:36 PM

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

20-05-2026 04:32 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి హాకీ శిక్షణ శిబిరంలో క్రీడాకారుల సమక్షంలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ మండల అభిమాన సంఘం నాయకుడు ఉయ్యాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారుల సమక్షంలో కేక్ కట్ చేసి అల్పాహారం, స్నాక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకులు క్రీడలు మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని భవిష్యత్తులో క్రీడల ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని సూచించారు.