26 February, 2026 | 9:11 AM

ప్రభుత్వాలున్నది పంచడానికేనా!

25-02-2026 12:00 AM

ఉచితాలతో ప్రజలు కూడా పరాన్నజీవులుగా మారుతున్నారు. ప్రభుత్వాలు కూడా అర్థం లేని ఉచితాలను ప్రకటిస్తూ ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి. ఇలాంటి ఉచితాల వల్ల ‘వికసిత్ భారత్’ సాధ్యం కాదు. 

ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత సంక్షేమ పథకాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత డీఎంకే సర్కార్ అందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంపై కొంద రు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.

ప్రభుత్వాలకు వచ్చే ఆదాయమంతా ఉచితాలకే ఖర్చు చేస్తే రాష్ట్రాలు, దేశం ఎలా అభివృద్ధి చెందుతాయి? కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం (లేదా) అధికారం అందిపు చ్చుకోవడానికి, అడ్డూ అదుపు లేకుండా దాదాపు దేశంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒకరికి మించి మరొకరు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఉచిత సంక్షేమ పథకాలు ఎరగా వేసి ఓట్లు దండుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి.

అధికారం చేపట్టిన తర్వా త వాటిని అమలు చేయడానికి మీనమేషా లు లెక్కించడం జరుగుతుంది. విపరీతంగా అప్పులు చేయడం, వడ్డీలు కొండలా పెరుగుతూ పోవడంతో చివరికి అధోగతి పాలవు తున్నాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎన్నికల సమయంలోనూ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ (తెలంగాణ), సూపర్ సిక్స్ (ఆంధ్రప్రదేశ్) పథకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

వాస్తవాలు గ్రహించాలి..

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలు ఉచితాలకు కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తున్నా యి. ఈ ఉచితాలను అమలు చేయడానికి ప్రతీనెలా రిజర్వ్ బ్యాంకు, వివిధ ఆర్థిక సం స్థలు, విదేశాల నుంచి వందల కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చి అమలు చేస్తున్నా యి. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, వేలం వేయడం జరుగుతున్నాయి.

నిధులు కొరతను సాకుగా చూపిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇవ్వవలసిన డీఏ, పీఆర్సీ నూతన వేతన సవరణ, మధ్యంతర భృతి తదితర ఆర్థిక చెల్లింపులు ఆలస్యం చేయడమో లేక చెల్లించకపోవడ మో జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన విద్యను అందించాలి.. వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ఆ విధంగా సుస్థిరాభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ అసలు ధ్యేయం పక్కన పెట్టి, అధికారమే లక్ష్యంగా ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తూ, బడ్జెట్లో అధిక నిధులు వెచ్చి స్తూ, ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతూ పోవడం సమంజసం కాదు. అయితే ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించకుండా ఉచితాలు వెంబడి పరుగులు తీస్తూ భారత భవిష్యత్తును స్వయంగా ప్రమాదకర స్థితిలోకి నెట్టేస్తున్నట్లుగా ఉంది.

అభివృద్ధికి ఆటంకం..

ఇప్పటికే ఈ ఉచిత సంక్షేమ పథకాలు ప ట్ల నీతి ఆయోగ్, ఆర్థికవేత్తలు, వివిధ ఆర్థిక సంస్థలు, న్యాయస్థానాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఏ ఒక్క రాజకీ య పార్టీ అయినా తమ ఎన్నికల మేనిఫెస్టోలో అవినీతిని అంతం చేస్తాం, అందరికీ విద్య, వైద్యం అందిస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, కనీస అవసరాలకు భరోసా కల్పిస్తాం, ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం, బలోపేతం చేస్తాం అనే హామీలు ఇ చ్చిన దాఖలాలు ఇసుమంతైనా కనిపించడం లేదు.

దాదాపు అన్ని పార్టీల మేనిఫెస్టో లు ఉచిత సంక్షేమ పథకాలతోనే నిండిపోతున్నాయి. అందుకే దేశం దాదాపు అన్ని రం గాల్లోనూ ఇప్పటికీ వెనుకబడే ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా మనదేశం ఇంకా అభివృద్ధి చెందు తున్న దేశంగా మిగిలిపోయింది. ఇకనైనా ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలి. దేశ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగుపడే విధంగా ప్రయత్నా లు చేయాల్సిన అవసరముంది.

అప్పుల ఊబిలోకి..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్) నివేదిక ప్రకారం ప్రపంచలోని అన్ని దేశాల అప్పు సుమారు 110.9 ట్రిలియన్ డాలర్లు గా ఉంది. మన భారత్ విషయానికి వస్తే ప్ర తీ భారతీయుడు నెత్తిపై 1.34 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఈ లెక్కన ప్రతీ భారతీ యుడు రుణగ్రస్తుడే. ప్రస్తుతం మన దేశం చేసిన అప్పు సుమారు 197.18 లక్షల కోట్ల రూపాయలు. 2027 నాటికి ఈ అప్పు 214.82 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అని గణాంకాలు పేర్కొంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల అప్పులు కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ అప్పులు అన్ని అనుత్పాదక రంగాలకు, ఉచిత సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం జరిగింది. తెచ్చిన అప్పులు అన్ని సంపద సృష్టికి, ఉత్పత్తి రంగాలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఖర్చు చేయకుండా.. ఎక్కువ భాగం ఉచిత సంక్షేమ పథకాలు అమలుకు ఖర్చు చేయడంతో దేశంలోని రాష్ట్రాలన్ని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రోజురో జుకు పెరిగిపోతుంది. ఆదాయానికి మించి ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. లోటు బడ్జెట్ తో వెలవెల బోతున్నాయి.

ముఖ్యంగా ఎన్నికల వచ్చే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ లు వివిధ పథకాల పేరుతో విపరీతంగా డ బ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది. గతేడాది బీహార్ ఎన్నికలకు ముందు నితీశ్ స ర్కార్ మహిళల ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు లు జమ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలోనూ ఇదే తరహా వైఖరి ఆవలంబిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అనర్హులే ఎక్కువగా..

నిజానికి ఉచితాల పేరుతో ప్రభుత్వాలు ఇస్తున్న నగదు, ఇతరత్రా.. పేద, మధ్య తరగతి ప్రజల నుంచి ప్రతీ వస్తువువై విధించిన పన్నుల సొమ్మునే తిరిగి ఇస్తున్నారని గ్రహించాలి. ఈరోజు మన దేశంలో ఏ గ్రామంలో కి వెళ్లి సర్వే చేస్తే అందులో సగానికి పైగా అనర్హులే ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉంటున్నారు. దీనికి కారణం రాజకీయ పలుకుబడి. దీంతో ఈ పథకాలు అమలు చేయడం బహుభారంగా మారి, ప్రభుత్వాలు తలకు మించిన అప్పులు చేస్తుండ డంతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది.

ఇంత ఖర్చు పెట్టినా, ఇప్పుడున్న ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వస్తాయా అంటే సమాధానం ఉండదు. ఉచితాలకు అంతం ఉం డదు. భవిష్యత్తులో మరెన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించి ఓట్లు దండుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఉచితా లతో ప్రజలు పరాన్నజీవులుగా మారుతున్నారు. ప్రభుత్వాలు కూడా అర్థం లేని ఉచి తాలను ప్రకటిస్తూ ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి. ఇలాంటి ఉచితాల వల్ల ‘వికసిత్ భారత్’ సాధ్యం కాదు. సుప్రీంకోర్టు, మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ సర్వేలు చెబుతున్న వాస్త వాల ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలకెక్కించుకోవాలి.

ప్రజలను ఉచితాలతో మభ్య పెట్టడం మానేసి ఉత్పాదక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతిఏటా సగర్వం గా ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అధిక నిధులు విద్య కు, వ్యవ సాయ, పారిశ్రామిక రంగాలకు కేటాయించాలి. నైపుణ్యా భివృద్ధికి పెద్ద పీట వేయాలి. ఆధ్యాత్మికత కంటే అక్షరాస్యతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఆధ్యాత్మికతకు నిధులు ఎక్కువ కేటాయిస్తే ఆయా వర్గాలు మాత్రమే లబ్ధి పొందుతాయి.

అదే అక్షరాస్యతకు కేటాయిస్తే యా వత్ దేశం అభివృద్ధి చెందుతుం ది. దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్ధికాభివృద్ధితోపాటు మానవ అభివృద్ధి సూచికలో ముందంజలో ఉండా లి. మానవ వనరులు అభివృద్ధికి పాటు పడాలి. పబ్లిక్ రంగం బలోపేతం చేయాలి. ప్రజా సౌకర్యాలను వీలైనంత పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేశంలో విస్తరించి ఉ న్న అవినీతి, బంధుప్రీతి తొలగించాలి. నిరుద్యోగం, అధిక ధరలు నియంత్రణకు చర్యలు చేపట్టాలి. శ్రమ ద్వారానే స్వావలంబన సా ధ్యమని ప్రభుత్వాలు, ప్రజలు గ్రహించినప్పుడే ఉచితాలకు ముగింపు.

వ్యాసకర్త సెల్: 6305682733

ఐ ప్రసాదరావు