పానీపూరి బండ్లపై తనిఖీలు
– నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: డాక్టర్ సురేష్
కోనరావుపేట,(విజయక్రాంతి): తినుబండారాల నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని కోనరావుపేట ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ సురేష్ హెచ్చరించారు. సోమవారం కోనరావుపేట మండల కేంద్రంలోని పానీపూరి బండ్లను ఆయన పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని తెలిపారు. పరిశుభ్రత పాటించకుండా లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆహార విక్రేతలు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.ఈ తనిఖీల కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






