కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో క్రైస్తవులకు అన్యాయం: బీజేపీ ఆరోపణ
14-04-2026 04:16 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపల్ పాలకవర్గంలో కోఆప్షన్ సభ్యుల నియామకంలో క్రైస్తవులకు స్థానం కల్పించకపోవడం సరికాదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలు దోమల మహేశ్వర్ పేర్కొన్నారు. ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లింలకు అవకాశం కల్పించగా క్రైస్తవులను పక్కన పెట్టడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. కోఆప్షన్ ప్రక్రియలో సమానత్వం పాటించాలని డిమాండ్ చేశారు.






