12 April, 2026 | 5:39 AM

యువత సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం

27-12-2025 01:12 AM

ప్రధాని నరేంద్ర మోదీ 

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౬: ‘జెన్ -జెడ్’, ‘జెన్- ఆల్ఫా’ తరాల సామర్థ్యాలపై తనకు అపారమైన విశ్వాసం ఉందని, వారి శక్తిసామర్థ్యాలపై ఆధారపడే దేశం ‘వికసిత్ భారత్’ వైపు అడుగులు వేస్తున్నదని ప్రధాని మోదీ కొనియా డారు. ‘వీర్ బాల్ దివస్’ సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన వేడుకలో ఆయన బాలబాలికలకు పురస్కారాలు అందజేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. వయసుతో నిమిత్తం లేకుండా గొప్ప పనులు చేసే వారే నిజమైన దేశభక్తులని అభివర్ణించారు. యువత స్వల్పకాలిక ప్రాచుర్యం, చేటు చేసే ఆకర్షణలకు లోనుకాకుండా దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, స్టార్టప్స్ నుంచి క్రీడల వరకు ప్రతి రంగంలోనూ సత్తా చాటవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికైనా యువత వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని, భారతీయ భాషలు, సంస్కృతిని పటిష్టపరిచే మార్గంలో పయనించాలని ఉద్ఘాటించారు.