3 July, 2026 | 4:26 AM

హిమాయత్‌నగర్ పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలి

03-07-2026 12:20 AM

సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్

మొయినాబాద్ జూలై 2(విజయ క్రాంతి): హిమాయత్నగర్లో ఇళ్ల స్థలాల కోసం ఏడో రోజు దీక్ష చేస్తున్న పేదలకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ, 2007లో 290 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినా ఇప్పటికీ స్థలాలు చూపించకపోవడం రెవెన్యూ యంత్రాంగం వైఫల్యమని విమర్శించారు.

పేదల కోసం కేటాయించిన భూమిని గుడిమల్కాపూర్ మార్కెట్ యార్డుకు కేటాయించే ప్రయత్నాన్ని వెంటనే నిలిపివేయాలని, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు సీపీఎం అండగా ఉంటుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.