16 April, 2026 | 7:18 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు

16-04-2026 05:01 PM

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య(BJP MP Tejasvi Surya) వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన తేజస్వి వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు  తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటమన్న హరీశ్ రావు వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని వెల్లడించారు.