4 March, 2026 | 1:34 AM

చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు!

04-03-2026 12:00 AM

ఫరూక్‌నగర్ మండలం రాయికల్ శివారులో ఘటన

షాద్‌నగర్, మార్చి 3(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ వసతి గృహం లో చదువుతున్న రాజు అనే విద్యార్థి ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యా డు గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు షాద్‌నగర్ పరిధిలోని నేషనల్ హైవే పక్కకు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల వసతి గృహంలో చదువుతున్నాడు.మంగళవారం హోలీ సందర్భంగా సెలవు ఉండడంతో నలుగురు విద్యార్థులతో కలిసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన రాజు మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.

చెరువులో మునిగి ఇద్దరు మృతి

హోలీ పండుగ రోజు విషాదం

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

కుత్బుల్లాపూర్, మార్చి 3(విజయక్రాంతి): హోలీ పండుగ పూట చెరువులో మునిగి ఇద్ద రు యువకులు మృతి చెందారు. ఈ సంఘట న సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరా రం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు సాగర్(17), అభిషేక్(17) హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకున్నారు. అనంతరం స్నానానికి పంతు లు చెరువులోని లోతైన ప్రదేశానికి వెళ్లడంతో సాగర్, అభిషేక్‌లకు ఊపిరాడక పోవడంతో ప్రాణాలు కోల్పయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.