3 April, 2026 | 7:02 PM

డోడ్డీగూడలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

03-04-2026 05:23 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం డోడ్డీగూడ గ్రామంలో రూ.3 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గురునులే నారాయణ ప్రారంభించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపడుతున్నదని తెలిపారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం కీలకమని ఆయన పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో రాకపోకలు సులభతరం అవు తాయని, ప్రజలకు ఇబ్బందు లు తగ్గుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని, భవిష్యత్తులో గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు గురునులే నారాయణ్, సీనియర్ నాయకులు జాబోరే గణేష్, ఉప్రే ధర్మ, ఉప సర్పంచ్ భీంరావ్, ఐడీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ బాజీరావు, గ్రామ కార్యదర్శి రమాదేవి, వార్డ్ సభ్యులు వాడై ఉమేష్, సిదాం అయ్యు, ఉప్రే రవి, ముంజం దయానంద్, గ్రామ పటేల్ గురునులే డోదజీ, వాడై పోశెట్టి, వాడై సావిత్రబాయి, సదాశివ్, జంగు, అన్నారావు, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.