2 May, 2026 | 9:19 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

02-12-2025 11:03 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి నివాసంలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎస్టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్రావు, సిఐ బిక్షారెడ్డి, ఎస్త్స్ర బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లోఅప్పగించారు.