26 February, 2026 | 6:23 PM

గద్దరన్న విగ్రహావిష్కరణ సభ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

26-02-2026 12:00 AM

అమన్ గల్లు, ఫిబ్రవరి 25( విజయక్రాంతి): మార్చి 8న కల్వకుర్తిలో జరగనున్న ప్రజా యుద్ధనౌక గద్దరన్న విగ్రహావిష్కరణ సభకు సంబంధించిన గోడ పత్రికను బుధవారం అమన్గల్ పట్టణంలో విడుదల చేశారు. విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ శర్మ మాట్లాడుతూ ప్రజాయుద్ధనౌక గద్దర్ తన జీవితమంతా తాడిత... పీడిత ప్రజా ఉద్యమాలు, సబ్బండ వర్గాల ప్రజాగొంతుకగా నిలిచి ప్రజాస్వామ్య ఉద్యమాలు నడిపారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అకాంక్షలో గద్దర్ అన్న పాత్ర మరువలేనిదని ఆయన కొనియాడారు. అమన్గల్ బ్లాక్ మండలా ప్రజాస్వామ్యవాదులు మరియు గద్దరన్న అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామన్న, జిల్లెల నర్సింహా, రజితక్క, బుక్షపతి, బొజ్జన్న, జక్కా గోపాల్, సాత్రి నర్సింహా, కొట్టేగారి శేఖర్, దుబ్బ సుధాకర్, కానుగుల జంగయ్య, పుసలా పరమేష్ తదితరులు పాల్గొన్నారు.