వృద్ధాశ్రమంలో అన్నదానం.. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ
అశ్వాపురం, జూన్ 18 (విజయక్రాంతి): భారాస మండల మాజీ అధ్యక్షుడు కందుల కృష్ణార్జునరావు అత్తగారు దివంగత వెనిగళ్ల శ్రీమతి ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని మానవీయ వృద్ధుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల కృష్ణార్జునరావు, ఆయన సతీమణి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దుర్గాభవాని ఆశ్రమంలోని వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి స్పందించిన మానవీయ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు కందుల కృష్ణార్జునరావు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవా స్పూర్తి మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవీయ వృద్ధుల ఆశ్రమం ఉపాధ్యక్షుడు ధైదా నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కమటం వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు సజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






