20 May, 2026 | 2:15 AM

అంగన్వాడీ టీచర్ కుటుంబానికి ఆర్థిక సాయం

20-05-2026 01:03 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 19 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ చాగర్తి లత ఇటీవల మృతిచెందగా ఆమె కుటుంబానికి ఐసిడిఎస్, ఆధ్వర్యంలో 20 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు ఐసిడిఎస్ సూపర్వైజర్ అప్సర్ సుల్తానా, బుద్ధారం సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ ల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు రేగూరి సరోజన, టీచర్లు శ్యామల, కోమల తదితరులు పాల్గొన్నారు.