18-02-2026 10:42:39 AM
- లబ్ధిదారులు తప్పనిసరిగా సరుకులు పొందాలి
-ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్
మునుగోడు, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు పౌర సరఫరా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తెలిపారు. మునుగోడులో ఆయన మాట్లాడారు.లబ్ధిదారుల సౌలభ్యం దృష్ట్యా రేషన్ దుకాణాలను 19వ తేదీ వరకు తెరిచి ఉంచాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని వారు ఈ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వివిధ కారణాల వల్ల రేషన్ తీసుకోలేకపోయిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమకు కేటాయించిన సరుకులను పొందాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం ద్వారా మిగిలిన వారందరికీ రేషన్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.