30 May, 2026 | 1:40 AM

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

30-05-2026 12:57 AM

మండల వ్యవసాయ అధికారి 

మునుగోడు, మే 29: రైతులు ప్రభుత్వ సేవలను సద్విని చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ అన్నారు. శుక్రవారం మండలంలోని గుడాపూర్ గ్రామంలో వానాకాలం సీజన్ నేప థ్యంలో రైతులకు ఆధునిక సాగు విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా తమ మొబైల్ నంబర్లను ఎరువుల బుకింగ్ యాప్లో అప్డేట్ చేసు కోవాలన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు సులభంగా అనుసంధానం అవుతాయన్నారు. రైతులు వరి కొయ్యకాళ్ళకి కాల్చకూడదని, ఇది పర్యావరణానికి హానికరమన్నారు. భూసార పరీక్షలు చేయించుకుని, మట్టిలో ఉన్న పోషకాలకు అనుగుణంగా మాత్రమే ఎరువులు వాడాలన్నారు. జీలుగు, జనుము, పెసర, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె పంటలను సాగు చేసి పూత దశకు ముందు భూమిలో కలియదున్నాలన్నారు.

గ్రామ సర్పంచ్ చైర్మన్గా, గ్రామ కార్యదర్శి, కృషి సఖి, డ్రోన్ దీదీ, ప్రోగ్రెసివ్ రైతు, పిఎసిఎస్/ఎఫ్ పి ప్రతినిధి, వ్యవసాయ అధికారి సభ్యులుగా గ్రామస్థాయి నిగ్రాణి సమితి కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలు ఎరువులు, విత్తనాల నాణ్యత పర్యవేక్షణ, నకిలీల నివారణ, భూసార ఆధారిత ఎరువుల వినియోగం, అక్రమ రవాణా నియంత్రణ వంటి అంశాలపై పనిచేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నన్నూరి భూపతి రెడ్డి, గ్రామ కార్యదర్శి నాగరాజు, ఆదర్శ రైతు నన్నూరి జితేందర్ రెడ్డి, దర్శనం లక్ష్మయ్య, దెందే మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. నరసింహ గ్రామ రైతులు పాల్గొన్నారు.