రాజకీయ కుట్రల్లో భాగంగానే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై అసత్య ప్రచారం
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు : తూమ్ మధు
వేములవాడ,జూన్ 22,(విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పు కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూ మ్ మధు ఆరోపించారు. ప్రజల్లో ఎమ్మెల్యేకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక రాజకీయ ప్రత్యర్థులు నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆది శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సం పాదించుకున్న నాయకుడని మధు అ న్నా రు. ఎలాంటి రాజకీయ వారసత్వం లే కుండానే ప్రజా మద్దతుతో ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ధాన్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే పే రును వివాదంలోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ కేసులో ఉన్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి చెందినవాడే తప్ప, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఆ వ్య వహారంతో ఎలాంటి సంబంధం లేదని స్ప ష్టం చేశారు.చట్టం తన పని తాను చేసుకుంటుందని, తప్పు చేసిన వారిపై దర్యాప్తు సం స్థలు చర్యలు తీసుకుంటాయని పేర్కొన్న ఆ యన, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజా ప్రతినిధుల ప్రతిష్టను దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
బీసీ వర్గాలకు చెందిన యువ నాయకుడిగా ఆది శ్రీనివాస్ ఎదుగుదల కొందరికి అసహనంగా మారిందని, అందుకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మధు విమర్శించారు. ప్రజా సేవలు, అభివృద్ధి కార్యక్ర మాలతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు న మ్మబోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రా జకీయంగా పోటీ పడలేని వారు దుష్ప్రచారాలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై చ ర్చించాలని, ప్రజలే తుది తీర్పు చెప్పేవారని మధు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పు జరుగుతున్న నిరాధార ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారని తెలిపారు.






