ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎగిరిశెట్టి నరేష్
13-04-2026 03:39 AM
అడ్వకేట్ నరేష్‌కి శుభాకాంక్షలు తెలిపిన పలువురు
రంగారెడ్డి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మడ్గుల్ మండలం కలకొండ గ్రామానికి చెందిన ఎగిరిశెట్టి పాపయ్య కుమారుడు అడ్వకేట్ ఎగిరిశెట్టి నరేష్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఘన విజయం సాధించడం పట్ల ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తమ పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన సభ్యులందరికీ, పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృద యపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ బాధ్యతను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహి స్తూ, సంఘ అభివృద్ధి,సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




