సమాజంలో సమానత్వాన్ని పెంచేది విద్య
* పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
* తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల భారీ విరాళం
పటాన్చెరు, మార్చి 23: విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని, సమాజ అభివృద్ధికి, వ్యక్తిగత ఎదుగుదలలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో గల విద్యా భారతి పాఠశాలలో రూ.20 లక్షల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల ను సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ విలువలతో కూ డిన నాణ్యమైన విద్యను అందిస్తూ..శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడం లో విద్యా భారతి సంస్థల కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్ర గ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే.. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి సంస్థ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, భారతీ విద్యా సమితి అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి రవి, టప్ప కుమార్, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




