calender_icon.png 10 February, 2026 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజులరామారంలో భూ ప్రకంపనలు

10-02-2026 07:32:13 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గాజులరామారం లోని మెట్ ఖానిగూడ, జీడిమెట్ల ఆదర్శ నగర్ లోని మంగళవారం ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 10:17 నిమిషాలకు దాదాపు మూడు సెకండ్లు భూమి అదరడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యి ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. ఇది భూకంపమా లేక భారీ నిర్మాణాల కోసం వాడే ఇతర పేలుడు పదార్థాల నుంచి వచ్చిన శబ్దమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఇదే విషయంపై ప్రగతి నగర్ లోని సునామీ హెచ్చరికల కేంద్రం ప్రతినిధులను వివరణ కోరగా తమ వద్ద ఎలాంటి భూ కంప సూచికలు రిక్టర్ స్కేల్ పై నమోదు కాలేదని తెలిపారు. భారీ నిర్మాణాల కోసం ఎవరైనా బ్లాస్టింగ్ చేస్తే అలా భూమి కంపించినట్లు కావొచ్చని అన్నారు.