8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

విధుల నుంచి డీపీసీవో తొలగింపు

03-05-2026 12:57 AM
  1. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
  2. ఎం.హరీష్‌పై పలు ఆరోపణలు  
  3. మొదట పద్ధతి మార్చుకోవాలని అధికారుల సూచన
  4. ప్రవర్తనలో మార్పులు రాకపోవడంతో బాధ్యతలను రద్దు చేస్తూ నిర్ణయం 

జగిత్యాల, మే 2(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బాలల పరి రక్షణ అధికారి ఎం.హరీష్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీచేసారు. ఆయనపై వచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలు నిజమని తేలడంతో విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు చేయడం, డ్యూటీ విషయంలో ఇబ్బందులు పెట్టడం వంటి పలు ఆరోపణలపై డీసీపీవో హరీష్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో గతంలోనే 2013 వర్క్‌ప్లేస్ హరాస్‌మెంట్ చట్టం కింద హరీష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు మొదట మందలించి పద్ధతి మార్చుకోవాలని సూచించారు.అయితే ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడం మళ్లీ ఫిర్యాదులు అందటంతో కంప్లైంట్స్ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది.ఆయనపై ఆరోపణలు నిజమేనని తేల్చిన కమిటీ జిల్లా అధికారులకు రిపోర్ట్ అందజేశారు. దీంతో కలెక్టర్ సత్యప్రసాద్ డీసీపీవో హరీష్ బాధ్యతలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సంబంధిత బాధ్యతలు, రికార్డులను జిల్లా వెల్ఫేర్ అధికారికి అప్పగించాలని ఆదేశించారు.