9 June, 2026 | 6:11 PM

దొడ్డి కొమురయ్య స్ఫూర్తి చిరస్మరణీయం మండేపల్లిలో విగ్రహావిష్కరణ

09-06-2026 04:49 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన త్యాగాలను స్మరించుకొని నివాళులర్పించారు. సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ... నిజాం పాలనలో దొరలు, దేశ్ముఖుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఆయన చూపిన ధైర్యం, త్యాగస్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.