డాక్టర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యకరంగా దూషించిన డాక్టర్
సహారా దవాఖాన ఎదుట గిరిజన సంఘాల ధర్నా
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 3: రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ శ్రేష్ట ఆరెంజ్ హాస్పిటల్(Sreshta Orange Hospital) యాజమాన్యానికి, సహారా హాస్పిటల్(Sahara Hospital) మధ్య వివాదం ఉన్నది. జరిగిన వివాదంలో బందోబస్తు కొచ్చిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న గిరిజన మహిళా కానిస్టేబుల్ పై తీవ్ర మైనటువంటి పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన సహారా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంకురి శెట్టి నరేశ్ పై, అతని అనుచరులపై వెంటనే ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం మన్సూరాబాద్‌లోని సహారా దవా ఖాన ఎదుట గిరిజన సంఘాల నాయకులు, గిరిజన విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టారు.
సందర్భంగా గిరిజన సంఘాల నా యకులు మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌లోని శ్రేష్ట ఆరెంజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, సహారా హాస్పిటల్ ఎండీ డాక్టర్ సుంకురి శెట్టి నరేష్ తదితరులకు మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంపై వివా దం కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో మంగళవారం నరేశ్ తన అనుచరులతో కలిసి కోర్టు ఆర్డర్ ఉందని ఆరెంజ్ హాస్పిటల్‌కు వచ్చా డు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సమచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి బందోబస్తుకు వచ్చారు.
అక్కడ విధుల్లో ఉన్న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గిరిజన కానిస్టేబుల్ సంధ్యాబాయిని డాక్టర్ నరేశ్ తీవ్రంగా దూషిస్తూ... అభ్యంతరమైన పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్ సంధ్యాబాయి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ నరేశ్ పై ఫిర్యాదు చేసింది. ఈ విషయం పోలీసులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లీగల్ ఓపీనియన్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తామని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. ఆనంతరం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో గిరిజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గిరి జన సంఘాల నాయకులు భరత్ నాయక్. పున్నిబాయి, దీప్లా నాయక్, శ్రీకాంత్ నాయ క్, వాసు నాయక్ పాల్గొన్నారు.






