4 September, 2026 | 2:57 AM

హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన సీఎం

04-09-2026 | 05:50am
  1. మంత్రి పదవి నుంచి నన్ను తొలగించకపోతే వెళ్లిపోతానని బెదిరించాడు 
  2. మంత్రి పొంగులేటి, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి.. సీఎం సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డిలు కుట్ర చేశారు
  3. నా కూతురు వ్యాఖ్యలతో నన్ను టార్గెట్ చేశారు 
  4. వివరణ కోరకుండా బర్తరఫ్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నా.. 
  5. రేవంత్‌రెడ్డి ఎప్పటికీ వైఎస్ కాలేడు
  6. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరూ సంతోంగా లేరు  
  7. కాంగ్రెస్‌కు రాజీనామా చేయను.. ఎమ్మెల్యేగానే కొనసాగుతా: కొండా సురేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాం తి) : మంత్రివర్గం(cabinet) నుంచి తనను బర్తరఫ్ చే యడంపై కొండా సురేఖ(Konda Surekha) సంచలన వ్యాఖ్యలు(Sensational Comments) చేశారు. తనను పదవి నుంచి తొలగించే ఆలోచన కాంగ్రెస్ అధిష్ఠానానికి(Congress High Command) లేదని, సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాల(Blackmail politics)కు పాల్పడి తనను బర్తరఫ్(dismissal) చేయించారని సురేఖ ఆరోపించారు. ‘నన్ను తప్పించకపోతే తానే వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధిష్ఠానాన్ని బెదిరించారు. టీడీపీ(TDP) రక్తం ఉన్నవారు ఇలాగే ప్రవర్తిస్తారు’ ఆమె హాట్ కామెంట్స్ చేశారు.

‘కనీసం సమాచారం ఇవ్వకుండా, రాజీనామా(resignation) చేయమని అడగకుండా, ఎలాంటి సం తకం లేని ఒక తెల్ల కాగితం ఆధారంగా నన్ను బర్తరఫ్ చేశారు. నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఎలాంటి తప్పులు చేయలే దు.  ఇది ఒక బీసీ మహిళను తీవ్రంగా అవమానించడమే. సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మపరి శీలన చేసుకోవాలి’ అని సురేఖ  మండిపడ్డా రు. తన బర్తరఫ్ వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వేంనరేందర్‌రెడ్డితో పా టు సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు  కొండ ల్ రెడ్డి, తిరుపతిల  కుట్ర ఉందని, తన ఉసురు వారికి  తగులుతుందని మండిపడ్డారు.

బుధవారం ఆమె తన నివాసంలో మీడియా సమావేశంలో.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలకు రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశా రు. ‘పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ఉమ్మడి వ రంగల్ జిల్లా ఇంచార్జి మంత్రిగా వచ్చిన మొ దటి రోజు నుంచే  నాపై పక్షపాతం చూపిస్తున్నారు. ఆయన వియ్యంకుడు, ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి చెప్పినట్లే పొంగులేటి నడుచుకుంటున్నారు.

బసవరాజు సార య్య, ఎర్రబెల్లి స్వర్ణతో పాటు జిల్లాలో నా వ్యతిరేక గ్రూప్ అంతా రఘురాంరెడ్డి శిష్యు లే’ అని కొండా సురేఖ తెలిపారు. ‘నా కూ తురు చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. తన కూతురు స్వతంత్ర మహిళ’ అని అన్నారు,   ‘ఎవరి కుటుంబంలోనైనా ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ అభిప్రా యంతో ఉంటున్నారు. డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన కుమారుడు అ ర్వింద్ బీజేపీలో ఉన్నారు. 

నా బిడ్డ పదేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే కడియం శ్రీహ రి.. తన కూతురిని ఎంపీగా చేసుకున్నారు. నా కూతురు వ్యాఖ్యల సాకుతో నన్ను టార్గె ట్ చేయడమే ఇక్కడ అసలు ప్లాన్ ’ అని విమర్శించారు. ఉరిశిక్ష వేసే ముందు కూడా చివరి కోరిక ఏంటో అడుగుతారని, మంత్రివర్గం నుంచి తనను తీసేసే ముందు వివ రణ కూడా తీసుకోకపోవడం అత్యంత బాధకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచే శారు.

తాను సీఎం గురించి ఎక్కడా ఏమి అనలేదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో నాయకులుకు, ప్రజలకు ని రంతరం ప్రాధాన్యత ఉండేదని కొండా సురే ఖ గుర్తు చేశారు. ప్రజలతో, పార్టీ నేతలతో వైఎస్సార్ ఉన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డికి క మ్యునికేషన్ లేదని, ఆయన నాయకులతో సరిగ్గా మమేకం కావడం లేదని ఆమె విమర్శించారు. 

ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు.. 

మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన ప్రమేయం లేకుండానే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్నార ని కొండా సురేఖ ఆరోపించారు. తనకు తెలియకుండానే తన ఓఎస్‌డీ సుమంత్‌ను త ప్పించారని,  అభివృద్ధి విషయంలో తన ని యోజకవర్గంపై వివక్ష చూపారని విమర్శించారు. తన శాఖలోని అంశాలపై కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన శాఖ అధికారులతో కడియం సమీక్షలు నిర్వహిచారని విమర్శించారు. ఇక సమ్మక్క, సారక్క ఆలయం పునరుద్ధరణ పనులు, యాదగిరిగుట్ట దేవాలయం బోర్డు నియామయంలో నూ  తన ప్రమేయం లేకుండానే నియామకాలు చేశారని ఆమె తెలిపారు. 

కాంగ్రెస్‌ను రోశయ్య, జైపాల్‌రెడ్డి, మల్లు రవి తిట్టారు.. 

సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీపైన తానెలాంటి విమర్శలు చేయలేదని కొండా సురేఖ తెలిపారు, ఒకప్పుడు మల్లు రవి కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టారని విమర్శించారు. మాజీ సీ ఎం  రోశయ్య , కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారని తెలి పారు. రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తె చ్చుకున్నారని తిట్టినవారికి పదవులు ఇచ్చారని, ఇప్పుడు తనను తొలగించారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

తనను తొలగించినందుకు ఏమి బాధపడటం లేదని, కారణం చెప్పకుండా తొలగించడమే చాలా బాధాకరమన్నారు. ఒక బీసీ మహిళాలను ఇలా అవమానకరంగా తొలగించడం బాధాకరమని, కారణం లేకుండా తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, కారణం చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీపై ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏమి నిర్ణయం తీసుకున్నారో చెపాలని ఆమె డిమాండ్ చేశారు. 

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.. 

పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పష్టమైన వివరణ ఇచ్చానని, అయినా వినకుం డా తనను టార్గెట్ చేశారని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.  రెండున్నరేళ్లు నా శాఖకు, ప్రజలకు న్యాయం చేశానని తెలిపారు. తానే మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని కొండా సురేఖ స్పష్టంచేశారు. ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజక వర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ ఇంకా ఆలోచిం చుకోలేదన్నారు.

‘పార్టీతీరు మారాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితిపై సర్వే చే యించుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలి. రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహారించడం సరికాదు. తనవైపు ఒక వేలు చూపితే.. రేవం త్‌రెడ్డి వైపు నాలుగు వేళ్లు చూపుతాయి. పదేళ్లు నేనే సీఎం అని, ఎమ్మెల్యేల అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారు. మంత్రులందరూ సంతోషంగా ఉన్నారా..? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలి.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు సంతోషంగా లేరనే విషయం అందరికి తెలుసు. ఇప్పటికైనా అందరూ బయటికి వచ్చి ధైర్యంగా  మాట్లాడాలి. ప్రజలకు సేవ, అభివృద్ది చేయలేకపోతున్నామనే బాధ అందరిలో ఉంది. పనులను జరగాలంటే ఎవరికి వద్దకు వెళ్లాలో తెలియని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇస్తామన్న హామీలు నేరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేక ఉంది’ అని సురేఖ అభిప్రాయపడ్డారు. ప్లాన్ బీపై ఇంకా ఏమి ఆలోచించలేదని ఆమె తెలిపారు. 

నావల్ల ముగ్గురు మహిళలకు పదవులు.. 

కొండా మురళికి పదవి ఇచ్చే విషయంపై రేవంత్ మాట తప్పారని కొం డా సురేఖ ఆరోపించారు. ‘సీఎం రేవం త్ రెడ్డి వరంగల్ పర్యటనలో కొండా మురళికి జిల్లా బాధ్యత ఇస్తా అన్నారు. 11 సీట్లు గెలిపించాం. ఆ తర్వాత అనేకసార్లు మురళి పదవి సంగతి ఏంటని సీఎంను అడిగితే, మీ జిల్లాలో, మురళికి మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని రండి.. పదవి ఇస్తానన్నారని’ ఆరో పించారు. అదే తనకు కావాల్సిన వారికి మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ఆరోపించారు.

‘వైఎస్‌ఆర్ తర్వాత రేవంత్‌రెడ్డిని ఎక్కువగా అభిమానించాను. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, సీఎం కా వాలని నేనే ముందు కోరుకున్నా. నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నాను. నన్ను బర్తరఫ్ చేయడం వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషకరం. చిన్నారె డ్డిపై వేటు వేయడం సరికాదు’ అని కొండా సురేఖ అన్నారు.