సాగర్ నీళ్లకై.. పాదయాత్ర చేస్తా
నల్లగొండ మంత్రులకు నీళ్లపై సోయి లేదు
- పదిరోజుల్లో షెడ్యూల్ ఇవ్వాల్సిందే
- ఏపీ నీటి తరలింపుపై నోరు మెదపని సీఎం
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
నల్లగొండ, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఈనెల 14 వరకు నాగార్జున సాగర్(Nagarjuna Sagar,) నీళ్ల షెడ్యూలు విడుదల(water schedule released) చేయకుంటే హాలియా నుంచి కోదాడ వరకు వేలాది మందితో పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నా రు. నల్లగొండ జిల్లా(Nalgonda district) మిర్యాలగూడలో గురువారం జరిగిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం(Srisailam), సాగర్(Sagar)లో నీళ్లు ఉన్నా.. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదన్నారు.
ప్రతి పంటకు రూ.500 బోనస్(bonus) ఇస్తామని ఎగ్గొట్టారని, రైతుబంధు(Rythu Bandhu) మూడుసార్లు ఎగవేశారని, రెండు లక్షల రుణమాఫీ చేయలేదని అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించారని విమర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) నీళ్లు ఇవ్వకుండా రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడని పేర్కొన్నారు. నీళ్ల విషయమై అసెంబ్లీలో నిలదీస్తా మన్నారు. గురుదక్షిణ కోసం ఏపీకి నీళ్లు తరలిపోతున్నా సీఎం రేవంత్ నోరు మెదపడం లేదన్నారు.
ఓటుకు నోటు కేసు బయటికి వస్తుందని నీళ్లపై నోరు ఇప్పడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలన దేశంలోనే రోల్ మోడల్‌గా తెలంగాణ ఉంటే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన దుష్ట పాలనగా మారి ందని అభివర్ణించారు. రైతు సమస్యలపై ధర్నా చేస్తామనగానే ప్రభుత్వానికి చలి జ్వర ం వచ్చిందని, ఈ ప్రభుత్వ సంగతి తేలుస్తామని, కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు.
కేసీఆర్ హయాంలో రికార్డు స్థాయిలో వరి పండించామని, అప్పుడు సాగర్ ఆయకట్టు కళకళలాడిందని, ఇప్పుడు దుర్భిక్షం నెలకొని పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్య క్తం చేశారు. 420 హామీలు ఇచ్చి, రైతు డిక్లరేషన్ అంటూ మభ్యపెట్టి కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిందని, అర్రస్ పాట పాడినట్లు అడ్డగోలు హామీలు ఇచ్చి పచ్చి మోసం చేసి ందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు తేరుకోవాలని, కేసీఆర్ చెప్పినట్లు మోసపోతే గోస పడతామన్నారు.
నీళ్లు లేక ఖమ్మం, సూర్యాపేట, మిర్యాలగూడ కోదాడ, హుజూర్‌నగర్, నల్లగొండ, నాగార్జునసాగర్, నకిరక ల్ ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశా నికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందని, న ల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గ్యారంటీలను, వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీలను స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలు గాలికి వదిలేసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నాడని విమర్శించా రు. నీళ్లు ఇవ్వకపోతే కేటీఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్య గౌడ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






