4 September, 2026 | 10:21 AM

యూనిఫామ్ ధరించి సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు

04-09-2026 | 04:05am

మహిళా ప్రజాప్రతినిధిపై వివాదాస్పద పోస్టులు

ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): పోలీసు యూనిఫాం ధరించి ప్రజల రక్షణలో ఉండాల్సిన వ్యక్తి సోషల్ మీడియాలో మహిళా ప్రజాప్రతినిధిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్(Cyberabad Police Commissionerate) కఠిన చర్యలకు దిగింది. హైదరాబాద్ సిటీ ఆరమ్డ్ రిజర్వ్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. అనిల్ను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సస్పెండ్ చేశారు.

2018 బ్యాచ్కు చెందిన అనిల్ అసలు పోస్టింగ్ సైబరాబాద్ సీఏఆర్లోనే. ప్రస్తుతం హైదరాబాద్ సీఏఆర్ ప్రధా న కార్యాలయానికి తాత్కాలికంగా పంపబడి అక్కడ విధుల్లో ఉన్నాడు. ఆయన సోషల్ మీడియాలో ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అసభ్య, అవమానకర వ్యాఖ్యలు చేసిన విషయం పోలీస్ అధికారుల దృష్టికి వచ్చింది. విచారణ అనంతరం సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ అయ్యాయి.

పోలీసులు సోషల్ మీడియాలో కూడా కట్టుదిట్టంగా ఉండాలి..

పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తి మర్యాద, గౌరవప్రదమైన ప్రవర్తన పాటించాలని సీపీ రమేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, శాఖ ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరిం చారు. యూనిఫాం ధరించిన వ్యక్తి ఆన్లైన్లో చేసే ప్రతి మాటకు కూడా బాధ్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అధికారిక ప్రకటనల్లో ఆ మహిళా నేత పేరు ప్రస్తావించలేదు. అయితే అదే రోజు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) నాయకులు కల్వకుంట్ల కవితపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కానిస్టేబ్పు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతినిధులు అదనపు డీజీపీ మహేష్ భగవత్ను కలిసి వినతి పత్రం అందించారు. కేవలం సస్పెన్షన్తో ఆగకుండా సర్వీసు నుంచి తొలగించాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

యూనిఫాంలో ఉన్నవారి బాధ్యత..

ప్రజల భద్రత కాపాడాల్సిన పోలీసు సిబ్బంది స్వయంగా సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య భాష వాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజా ప్రతినిధి అ యినా, సాధారణ మహిళ అయినా ఆన్లైన్లో అవమానించడం చట్టవిరుద్ధమని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

పోలీసు శాఖ ప్రతిష్టపై ప్రశ్నలు రాకుండా ఇలాంటి సంఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పౌ రసంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం అన్పి డిపార్ట్మెంటల్ సస్పెన్షన్ అమలులో ఉంది. క్రిమినల్ కేసు నమోదు అయిందా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం ఇం కా రాలేదు. మరిన్ని చర్యలు తీసుకుంటారా అనేది విచారణపై ఆధారపడి ఉంటుంది.