10న ఉద్యోగుల 'చలో హైదరాబాద్'
సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 4(విజయక్రాంతి) : ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈ నెల 10న నిర్వహించే 'చలో హైదరాబాద్'('Chalo Hyderabad)ను విజయవంతం చేయాలని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్(JAC Chairman), టీఎన్జీవో సిద్దిపేట(TNGO Siddipet) జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ పిలుపునిచ్చారు. టీఎన్జీవో(TNGO) ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘం కార్యదర్శి విక్రంరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 2023 జూలై నుంచి మెరుగైన ఫిట్మెంట్ తో రెండో పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా కొత్త ఆరోగ్యం కార్డులను అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'చలో హైదరాబాద్'(Chalo Hyderabad) కార్యక్రమానికి ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు.






