4 September, 2026 | 12:09 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

04-09-2026 | 04:30am
  1. బ్లాక్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి 
  2. కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ  సంకీర్త్ 

భూపాలపల్లి, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ రాహుల్ శర్మ (District Collector, District Road Safety Committee Chairman Rahul Sharma) ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి రోడ్డు భద్రతా కమిటీ, హైవే టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, బ్లాక్స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ, హైవే పెట్రోలింగ్, అత్యవసర వైద్య సేవలపై సమీక్షించారు.

జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 10 బ్లాక్స్పాట్లను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాలను సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి క్రాష్ బ్యారియర్లు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్, లైటింగ్ వంటి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అతివేగం, ఓవర్లోడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడంపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అవసరమైన చోట స్పీడ్ లిమిట్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రధాన రహదారులపై అనధికార పార్కింగ్ను నియంత్రించా లని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేలా హైవేలపై పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. 1033 హెల్పల్పు ప్రజలకు అవగాహన కల్పించాలని, రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించారు.

శాఖల వారీగా బాధ్యతలు, కాలపరిమితితో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ఫోన్ వినియోగించవద్దని సూచించారు. ఈసమావేశంలో డీఎస్పీ సంపత్రావు, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ఆర్‌అండ్బీ ఈఈ మనోహర్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, జాతీయ రహదారుల ఈఈ కిరణ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.