4 September, 2026 | 11:08 AM

Sri Krishna Janmashtami: నిస్వార్థ కర్మకు శ్రీకృష్ణుడు స్ఫూర్తి

04-09-2026 | 08:59am

ప్రధాని మోదీ జన్మాష్టమి శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు(Sri Krishna Janmashtami) ఘనంగా జరుగుతున్నాయి. మథుర శ్రీ కృష్ణా జన్మభూమి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, ముంబై, నోయిడా, హైదరాబాద్ లో భక్తులు పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే ఇస్కాన్ టెంపుల్స్ కు భక్తులు బారులు తీరారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు(Happy Krishna Janmashtami 2026) తెలిపారు. నిస్వార్థ కర్మకు శ్రీ కృష్ణుడు స్ఫూర్తి అన్నారు. మానవాళికి శ్రీకృష్ణుడు మార్గనిర్దేశం చేశారని Narendra Modi చెప్పారు. శ్రీకృష్ణుడి బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

''మీ అందరికీ హృదయపూర్వక జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ భగవానుని దివ్య సందేశాలలో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప ప్రేరణ ఇమిడి ఉంది; ఇది మానవాళికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. ఆయన భక్తికి, ఆరాధనకు అంకితమైన ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సానుకూల శక్తిని మరియు బలాన్ని నింపాలని నా హృదయపూర్వక ఆకాంక్ష. జై శ్రీకృష్ణ(Jai Sri Krishna)!'' అంటూ ప్రధాని ఎక్స్ లో పోస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు(Sri Krishnashtami Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) పర్యవేక్షణలో సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకృష్ణాష్టమి మహాత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని భక్తులకు ఆహ్వానించారు.