13వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ
బోధన్, సెప్టెంబర్ 04 (విజయ క్రాంతి): బోధన్(Bodhan) పట్టణంలోని 13వ వార్డులో గురువారం ఇందిరమ్మ చీరల(Indiramma sarees) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ లంక రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు(families) ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బోధన్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాము, కౌన్సిలర్లు చిరంజీవి, జహీర్, ప్రసాద్, కిషోర్, బోధన్ యూత్ ప్రెసిడెంట్ తలారి నవీన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల పథకం ద్వారా లబ్ధి పొందిన పి. విజయ, డి. విజయలు మాట్లాడుతూ.. తమలాంటి పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల(Indirammas house) పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం లభించిందని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.






