4 September, 2026 | 4:22 PM

బస్సు బోల్తా, డ్రైవర్ దుర్మరణం, ప్రయాణికులకు గాయాలు

04-09-2026 | 01:56pm

కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా(Jukkal Crossroads) వద్ద 161జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు(RTC busd) శుక్రవారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్(Driver) దుర్మరణం చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బిచ్కుంద ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantharao) కామారెడ్డి నుంచి జుక్కల్ కి బయలుదేరి వెళ్లారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని జిల్లా  వైద్యశాఖ అధికారి వెంకట్ కు ఆదేశించారు. బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వివరాలు తెలియాల్సి ఉంది.