12 August, 2026 | 9:51 AM

పాస్‌పోర్టు సేవల్లో అంతరాయం

12-08-2026 12:09 AM
  1. సర్వర్ డౌన్‌తో దరఖాస్తుదారుల పడిగాపులు
  2. హైదరాబాద్, తిరుపతి, విజయవాడలో తీవ్ర ఇబ్బందులు

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశవ్యాప్తంగా పలుచోట్ల పాస్పోర్ట్ కార్యాలయాల్లో మంగళ వారం సేవలకు అంతరాయం కలిగింది. సర్వర్ డౌన్ సమస్య కారణంగా పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రాంతీయ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారులు గంట ల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరోవైపు ప్రాంతీయ కార్యాలయాల వద్ద కనీస వసతులు కూడా లేవనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.

సర్వర్ డౌన్ సమస్య కారణంగా దరఖాస్తుదారుల అపాయింట్‌మెం ట్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. హైదరాబాద్, ఎంజీబీఎస్, విజయవాడ, తిరుప తిలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయలేదు. మరోవైపు సర్వర్లు పనిచేయడం లేదనే విషయంపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం వచ్చామని.. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత సర్వర్లు పనిచేయలేదని చెప్తున్నారని వాపోతున్నారు. మరోవైపు వీసాల మంజూరు, విదేశీ ప్రయాణాల కోసం పాస్పోర్ట్ తప్పనిసరి. అంతటి కీలకమైన పాస్పోర్టు సేవలు అందించే కార్యాలయాలలో కనీస వసతులు లేకపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.