12 July, 2026 | 2:14 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

రోడ్లు, భవనాల అభివృద్ధి పనులపై మంత్రితో కీలక చర్చలు

18-01-2026 07:24 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): మేడారం జాతరలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం, ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నిమిత్తం హనుమకొండకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం హనుమకొండ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు, భవనాలు, పలు అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం గుర్తింపు పొందిందని, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే అన్నారు.