కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇటీవల కేటాయించిన ఎకరం స్థలాన్ని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ శని వారం మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ ఛైర్మెన్ ఆడి బోజారెడ్డితో కలిసి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు, స్థలాన్ని చదును చేసే పనులు, మౌలిక వసతుల కల్పన, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీకి శాశ్వత చిరునామాగా నిలిచే ఈ నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతమివ్వడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండే కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సేవాదళ్ అఫ్సర్ ఖాన్, డీసీసీ జనరల్ సెక్రటరీ శివాజీ కాంబ్లే, ఇమ్రాన్ భైగ్, 26వ వార్డ్ అధ్యక్షులు జీషణ్ తో పాటు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.






