31 May, 2026 | 12:41 AM

రిటైర్డ్ పోలీసులను సన్మానించిన సైబరాబాద్ సీపీ

31-05-2026 12:00 AM

శేరిలింగంపల్లి, మే 30 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో శనివారం పదవీ విరమణ పొందిన 12 మంది పోలీసు సిబ్బందిని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సీపీ వారికి పెన్షన్ పత్రాలు అందజేసి, పూలమాలలు వేసి, శా లువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు.

రిటైర్ అయిన వారిలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం. ఫజ్లూర్ రెహమాన్, ఎస్‌ఐలు జి. రామ్చందర్, ఎం. నరసింహారెడ్డి, వివిధ స్టేషన్ల ఏఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్లు ఉన్నారు. సీపీ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. పదవీ విరమణ ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే, సేవా భావానికి కాదని అన్నారు. అనుభవాన్ని యువతతో పంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సృజన కర్ణం తదితరులు పాల్గొన్నారు.