9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఎంపీ ప్రియా సరోజ్‌తో క్రికెటర్ రింకు సింగ్ నిశ్చితార్థం

08-06-2025 05:40 PM

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) ఎంపీ ప్రియా సరోజ్‌(MP Priya Saroj)తో భారత క్రికెటర్ రింకు సింగ్(Cricketer Rinku Singh) నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. నవంబర్ 18వ తేదీన వారణాసిలోని తాజ్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది. లక్నోలోని సెంట్రమ్ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు  రింకు, ప్రియా కుటుంబాలతో పాటు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Samajwadi Party Chief Akhilesh Yadav), డింపుల్ యాదవ్, జయా బచ్చన్‌తో పాటు రామ్ గోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్ సహా పలువురు ప్రముఖ నాయకులు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్లు, ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరై, ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

అలీఘర్‌కు చెందిన రింకు సింగ్ గత రెండేళ్లలో భారతదేశం తరపున రెండు వన్డేలు, 33 టీ20లు ఆడారు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌  ఫ్రాంచైజీ తరుపున ఆడి 2024 సీజన్‌లో టైటిల్‌ను గెలుపొందాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని కార్ఖియావ్ గ్రామానికి చెందిన ప్రియా సరోజ్‌(26) జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ప్రియా తన చట్టపరమైన చతురత, యువ శక్తికి ప్రసిద్ధి చెందింది. ఆమె భారతదేశంలోని అతి పిన్న వయస్కులైన ఎంపీలలో ఒకరైన ప్రియా, తన తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లో కొనసాగించారు. తండ్రి తుఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యేగా యూపీలోని కెరకట్ నుండి ఎన్నికయ్యారు. ప్రియా 2024లో బీజేపీ సీనియర్ నేత బీపీ సరోజ్‌ను 35,000 ఓట్లకు పైగా తేడాతో ఓడించి మచ్లిషహర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాజకీయ నాయకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.