9 May, 2026 | 9:42 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

08-06-2025 06:53 PM

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025(AP EAPCET-2025) ఫలితాలను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఫలితాలను జేఎన్టీయు-కాకినాడ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్(Vice-Chancellor Professor C.S.R.K. Prasad) విడుదల చేశారు. వీసీ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. పరీక్షల్లో మొత్తం 75.67 ఉత్తీర్ణత శాతం నమోదు అయినట్లు వెల్లడించారు. ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించిన 12 రోజులకే ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఈఏపీసెట్ పరీక్ష ఏపీ, తెలంగాణ మొత్తంగా 145 కేంద్రలలో అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షకు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది పరీక్ష రాసారు.

వీరిలో 2,57,509 మంది ఉత్తీర్ణత పొందారని వీసీ తెలిపారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది.. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్ రెడ్డి తొలి ర్యాంకు సాధించగా,  శ్రీకాళహస్తికి చెందిన భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు పొందాడు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో పెనమలూరూకు చెందిన సాయి హర్షవర్ధన్ తొలి ర్యాంకు సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిషాంత్ రెండో ర్యాంకు పొందాడు.