5 April, 2026 | 7:52 PM

28 నెలల్లో 3.47 లక్షల కోట్ల అప్పు

05-04-2026 01:21 AM
  1. రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు
  2. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బొందపెడితే ఊరుకోం
  3. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 28 నెలల్లోనే రూ.3 లక్షల 47 వేల కోట్ల అప్పు చేసిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల లో రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే.. తామేం తక్కువకాదు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే భారీగా అప్పులు చేసి రికార్డు సృష్టించిందని మండిపడ్డారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం కొత్తగా ఒక్క పథకం లేదని, ఒక ప్రాజెక్టు కట్టలేదని.. అసలు ఉన్న పథకాలనే బొంద పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాగ్, ఆర్బీఐ నివేదికల ప్రకారం 2025- ఆర్థిక సంవత్సరంలో 365 రోజుల్లో 363 రోజులు ఈ ప్రభుత్వం అప్పులపై ఆధారపడి నడిచిందని, కేవలం రెండు రోజులు మాత్రమే అప్పు లేకుండా గడిచాయని, ఒకే సంవత్సరంలో వివిధ మార్గాల ద్వారా సుమారు రూ.లక్ష 30 వేల కోట్లకుపైగా అప్పు చేసిందని పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం డైలీ వేజ్ గవర్నమెంట్‌లా పనిచేస్తోందని, రోజూ అప్పు తీసుకుని నడిచే సర్కారు రేవంత్‌రెడ్డి ప్రభుత్వమని దుయ్యబట్టారు. అలాంటి నాయకులు కేరళంకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్ప డం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇం ట్లో జీరో, బయట హీరో కావాలనే ప్రయత్నంలో ఉన్నారని, చేతల్లో జీరో.. మాటల్లో, మూటల్లో మాత్రం హీరో అనే స్థాయికి వెళ్లిపోయారని ఆరోపించారు.

ఈ మొత్తం ప రిస్థితి చూస్తే పర్పార్మెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్ అనేలా ఉందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి పరిస్థితి అప్పట్లో ఆరు గ్యారెంటీలు.. ఇప్పు డు 6 మోసాలు... అప్పట్లో అభయహస్తం.. ఇప్పుడు భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. మరోవైపు రూ.3 లక్షల కోట్లకుపైగా బడ్జెట్ పెట్టామని కాంగ్రెస్ నాయకు లు అంటున్నారని, కానీ అది వాస్తవానికి జీరో బడ్జెట్ అని, ఈ ప్రభుత్వ బడ్జెట్ పూర్తి గా తప్పులతడకగా ఉందని పేర్కొన్నారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం బొందపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, విద్యార్థులు స్వయంగా ఫీజులు చెల్లించుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు. వెంట నే ఆ తీర్పుపై స్టే కోసం అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టెక్స్‌టైల్ రం గంలో నంబర్ వన్ అని, 2047 నాటికి ప్ర పంచంలోనే నంబర్ వన్ చేస్తామని సీఎం చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు.