16-02-2026 07:24:34 PM
సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి టి. శంకర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): భూ పోరాటంలో కామ్రేడ్ నరసింహ కృషి ఎనలేనిదని ఆయన మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు అని సిపిఐ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటపల్లి శంకర్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జవహర్ నగర్ లోని రావి నారాయణరెడ్డి (సిపిఐ) కాలనీలో నివసించే నరసింహ(55) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలిసిన పార్టీ శ్రేణులు నరసింహ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల నరసింహ, కురుమయ్య, రవి నాయక్ ,లక్ష్మణ్, సాయికిరణ్, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.