3 March, 2026 | 4:27 AM

భయ్యం పీకిపారెయ్ రా.. సిగ్గుంటె సీరెయ్‌రా..

03-03-2026 01:03 AM

స్టార్ హీరో రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘చికిరి’కి మంచి స్పందన దక్కింది. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ ‘రై రై రారా’ను విడుదల చేశారు.

‘రై రై రారా.. రై రై రారా.. అడ్డే లేని దారై రారా.. రై రై రారా.. రై రై రారా.. హద్దే లేని తీరై రారా.. దూరేటి దూరైరా.. పోరాడేటి పోరై రా.. నీలో ఆరునూరై రా.. మంటల్లోంచి వేరై రా.. భయ్యం పీకిపారెయ్ రా.. సిగ్గుంటె సీరెయ్‌రా..’ అంటూ సాగుతోందీ పాట. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చటమే కాక స్వయంగా ఆయనే ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్; సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.