కాటారంలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటన
జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్,జూలై 2 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లాలోని కాటారం మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై తనిఖీలు నిర్వహించారు.అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, పీఏసీఎస్ కేంద్రం, ఆర్డీఓ కార్యాల యాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, సంక్షేమ పథకాల అ మలు, రైతులకు అందుతున్న సేవలు, రెవె న్యూ వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, పోషణ, విద్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. బాలింతలకు, చిన్నారులకు బాలామృతం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ
అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, మధ్యా హ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వి ద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు పెంపొందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉం చాలని అధికారులకు సూచించారు.
పీఏసీఎస్ కేంద్రంలో రైతులతో ముఖాముఖి
తదుపరి కాటారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, యూరియా బుకింగ్ వివరాలు, ఎరు వుల నిల్వలు, స్టాక్ నిర్వహణపై వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓను అడి గి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి యూరియా బుకింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతోందా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసా య శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రెవె న్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలోని బల్క్ ల్యాండ్ సమస్యలు, సాదా బైనామా, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, చిన్న కాళేశ్వ రం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, వ్యవసాయ అధికారి బాబురావు, మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీడీపీఓ రాధిక, తహసీల్దార్ నాగరాజ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






