మహారాజా అగ్రసేన్ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి
హైదరాబాద్: మహారాజా అగ్రసేన్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం పుష్పాంజలి ఘటించారు. మహారాజ్ అగ్రసేన్ జయంతిని(Agrasen Maharaj Jayanti) పురస్కరించుకుని అఖిల భారత వైశ్య ఫెడరేషన్(All India Vaish Federation), తెలంగాణ అగర్వాల్ సమాజ్ సంయుక్తంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అఖిల భారత వైశ్య సమాఖ్య అధ్యక్షుడు గిరీష్ సంఘితో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.






